Vizag Beach | విశాఖ బీచ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. యారాడ బీచ్‌లో స్నానానికి దిగిన ఇద్దరు యువకులు.. అలల తాకిడికి కొట్టుకుపోయారు.
వివరాల్లోకి వెళ్తే.. ఇటలీ నుంచి ఇండియా పర్యటనకు 16 మంది యాత్రికులు వచ్చారు. ఈ క్రమంలోనే ఆదివారం నాడు వారు వైజాగ్‌కు వచ్చారు. యారాడ బీచ్‌లో సేద తీరుతున్న సమయంలో అలల తాకిడికి ఇద్దరు సముద్రంలోకి కొట్టుకుపోయారు. ఎప్పటికప్పుడు అలల వేగాన్ని అంచనా వేయకపోవడంతో వారిని ఒక్కసారిగా అలలు లోపలికి లాక్కుపోయాయి. అయితే వారి కేకలు విన్న స్థానికులు వెంటనే లైఫ్ గార్డ్స్‌కు సమాచారం అందించారు. కొట్టుకుపోతున్న ఇద్దరిని రక్షించేందుకు ప్రయత్నించారు. వీరిలో ఒకరు మృతిచెందగా.. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది.