అమరావతి : నంద్యాల జిల్లాలోని శ్రీశైలం ప్రాజెక్టుకు ( Srisailam Project ) జూరాల నుంచి 76,841 క్యూసెక్కుల నీటి ప్రవాహం వస్తుండగా 67,318 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఎడమ గట్టు విద్యుత్కేంద్రం నుంచి 35,315 క్యూసెక్కులు,కుడిగట్టు విద్యుత్కేందం నుంచి 32,003 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు అధికారులు వివరించారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 875.9 అడుగల వరకు నీరు నిలువ ఉంది. శ్రీశైలం ప్రాజెక్టు సామర్ధ్యం 215.8 టీఎంసీలకు గాను 167. 8 టీఎంసీల నీరు ఉందని వెల్లడించారు.