అన్నమయ్య జిల్లా మదనపల్లి సమీపంలో రాయల్పాడు దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఏపీ-కర్ణాటక సరిహద్దుల్లో రెండు ప్రైవేటు ట్రావెల్ బస్సులు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఇద్దరు మృతిచెందారు.
ఈ ప్రమాదంలో 40 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను కోలార్, శ్రీనివాసపురం, మదనపల్లి జిల్లా ప్రభుత్వ ఆస్పత్రులకు తరలించారు.