Republic Day | ఏపీలో 77వ గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నారు. రాజధాని అమరావతిలో తొలిసారి రిపబ్లిక్ డే వేడుకలు నిర్వహించారు. హైకోర్టు సమీపంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మైదానంలో ఈ వేడుకలు చేపట్టారు. గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రులు, హైకోర్టు న్యాయమూర్తులు, ఇతర అధికారులతో పాటు రాజధాని రైతులు కూడా పాల్గొన్నారు.
అనంతరం పరేడ్లో పాల్గొన్న11 దళాల నుంచి గవర్నర్ గౌరవ వందనాన్ని స్వీకరించారు. గణతంత్ర వేడుకల్లో భాగంగా రాష్ట్ర ప్రగతిని చాటేలా 22 శకటాలను ప్రదర్శించారు. ఈ వేడుకలకు రాజధాని రైతులు, విద్య