హైదరాబాద్, ఫిబ్రవరి 16 (నమస్తేతెలంగాణ) : ఆంధ్రప్రదేశ్‌లో తొలి జీబీఎస్ మరణం సంభవించింది. ప్రకాశం జిల్లాలోని కొమరోలు మండలం అలసందలపల్లి గ్రామానికి చెందిన కమలమ్మకు గులియన్ బారే సిండ్రోమ్ వ్యాధి సోకింది. గుంటూరు ప్రభుత్వ హాస్పిటల్లో రెండు రోజులపాటు చికిత్స పొంది ఆదివారం మృతి చెందింది.
ఈనెల 3న గుంటూరు జీజీహెచ్‌కు కమలమ్మను తీసుకెళ్లగా ఆమెకు జీబీఎస్ వైరస్ సోకినట్టు వైద్యులు నిర్ధారించారు. ఈ వ్యాధి ప్రమాదకరమైన అంటు వ్యాధి కాకపోయినప్పటికీ.. కొన్ని సందర్భాల్లో మరణాలు సంభవిస్తాయని వైద్యులు తెలిపారు. ఈ వ్యాధి ఎందుకు సోకుతుందో ఎవరికీ అంతుపట్టడం లేదని పేర్కొన్నారు.