అమరావతి : బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో ఉమ్మడి కృష్ణాజిల్లా వ్యాప్తంగా భారీగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ప్రకాశం బ్యారేజ్‌కు వరద ప్రవాహం భారీగా పెరుగుతోంది. ముందు జాగ్రతగా అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. ప్రస్తుతం బ్యారేజ్ ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 4.07 లక్షల క్యూసెక్కులుగా కొనసాగుతుందని వారు వెల్లడించారు.
కృష్ణానది పరీవాహక ప్రాంత ప్రజలు పలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కాలువలు , వంకలు, వాగులుదాటే ప్రయత్నం చేయరాదని సూచించారు. శనివారం తెల్లవారుజాము నుంచి విజయవాడ నగరంలో భారీగా వర్షం కురుస్తుంది. దీంతో సింగ్ నగర్, మొగల్రాజపురం,బెంజ్ సర్కిల్,ఆటోనగర్, లబ్బీపేట ప్రాంతాలు జలమయమయ్యాయి.