అమరావతి : విశాఖపట్నంలోని (Visakhapatnam ) గోపాలపట్నం జనసేన (Janasena) కార్యాలయంలో శుక్రవారం అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. విద్యుత్ షార్ట్‌సర్క్యూట్‌తో (short Circuit) మంటలు చెలరేగాయి. స్థానికుల సమాచారంతో అగ్నిమాపక సిబ్బంది హుటాహుటినా ఘటన స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. టీడీపీ ఎమ్మెల్యే గణబాబు, జనసేన నాయకులు జనసేన కార్యాలయాన్ని పరిశీలించారు. కార్యాలయంలోని ఫర్నీచర్, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులు దగ్ధమయ్యాయని అగ్నిమాపక సిబ్బంది తెలిపారు.