అల్లూరి జిల్లా: ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి జిల్లా ఏజెన్సీలో మావోయిస్టులు (Maoists), పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. మావోయిస్టులు ఉన్నారనే సమాచారంతో ఏజెన్సీలో పోలీసులు గాలింపు చేపట్టారు. ఈక్రమంలో కాకులమామిడి, కంటారం దగ్గర పోలీసులకు తారపడిన మావోయిస్టులు కాల్పులు జరిపారు. ప్రతిగా భద్రతా బలగాలు కూడా కాల్పులు జరపడంతో వారు అక్కడి నుంచి తప్పించుకున్నారు. దీంతో మావోయిస్టుల కోసం జల్లడపడుతున్నారు.
మరోవైపు ఛత్తీస్గఢ్ దండకారణ్యంలో మావోయిస్టులు, భద్రతా దళాలకు మధ్య సోమవారం సాయంత్రం ఎదురు కాల్పులు జరిగాయి. గత వారం రోజులుగా తెలంగాణ-ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో వేల సంఖ్యలో భద్రతా దళాలు మావోయిస్టుల కోసం కూంబింగ్ ఆపరేషన్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా నడిపల్లి-గల్గామ్ గ్రామాల మధ్య గల అటవీ ప్రాంతంలో మావోయిస్టులు తారసపడి జవాన్లపై కాల్పులు జరిపారు. అప్రమత్తమైన జవాన్లు ఎదురు కాల్పులకు దిగారు. కాగా, భద్రతా బలగాలు వారం రోజులుగా కర్రెగుట్టలను జల్లెడ పడుతున్నాయి. ఐదు రోజుల క్రితం జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు మహిళా మావోయిస్టులు హతమయ్యారు.