Tirumala | తిరుమల తిరుపతి దేవస్థానంలో మరో అపశృతి చోటు చేసుకుంది. మొన్న వైకుంఠ ఏకాదశి టోకెన్ల కోసం జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆ ఘటన మరువక ముందే.. మరో ప్రమాదం సంభవించింది.
తిరుమల లడ్డూ ప్రసాదం అందజేసే కౌంటర్ల వద్ద ఉన్నట్టుండి ఒక్కసారిగా అగ్నికీలలు ఎగిసిపడ్డాయి. దీంతో భక్తులు తీవ్ర భయాందోళనకు గురై పరుగులు తీశారు. ఈ అగ్నిప్రమాద ఘటన 47వ నెంబర్ లడ్డూ కౌంటర్లో చోటు చేసుకున్నట్లు టీటీడీ సిబ్బంది ధృవీకరించారు.
లడ్డూ టోకెన్లు జారీ చేసి కంప్యూటర్‌కు సంబంధించిన యూపీఎస్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఈ ప్రమాదం జరిగినట్లు పేర్కొన్నారు. యూపీఎస్‌లో షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు ఎగిసిపడ్డాయని తెలిపారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనాస్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదు. దీంతో టీటీడీ సిబ్బంది, పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.
బ్రేకింగ్ న్యూస్
తిరుమలలో మరో అపశృతి
తిరుమల లడ్డు కౌంటర్లో అగ్ని ప్రమాదం
నిత్యం భక్తులతో కిటకిటలాడే లడ్డు ప్రసాదాలను అందచేసే ప్రాంతంలో ఈ ఘటన జరగడంతో భక్తులు భయబ్రాంతులకు గురై పరుగులు తీశారు
47 వ నెంబరు కౌంటర్లో ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది
కంప్యూటర్ సిస్టంకు సంబంధించిన… pic.twitter.com/6MJznZrvtp
— Telugu Scribe (@TeluguScribe) January 13, 2025
ఇవి కూడా చదవండి..
HMPV Case | మరో చిన్నారికి HMPV పాజిటివ్.. భారత్‌లో 18కి చేరిన కేసులు
Mulayam Singh Yadav | మహా కుంభమేళాలో ములాయం సింగ్ విగ్రహం.. సమాజ్‌వాదీ పార్టీపై తీవ్ర విమర్శలు