Vizag | విశాఖపట్నం పూర్ణ మార్కెట్లో సోమవారం అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఆరు దుకాణాలు పూర్తిగా మంటల్లో కాలిపోయాయి. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది నాలుగు ఫైర్ ఇంజన్లతో సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.
న్యూఇయర్ వేడుకల నేపథ్యంలో వ్యాపారులు పెద్ద ఎత్తున రంగులు తీసుకొచ్చి స్టోర్ చేశారు. ఈ క్రమంలో సోమవారం అర్ధరాత్రి ఒక షాపులో మంటలు చెలరేగాయి. అవి కాస్త ఎక్కువై.. ఇతర షాపులకు కూడా వ్యాపించాయి. దీంతో ఆరు షాపుల్లోని సామగ్రి మొత్తం పూర్తిగా దగ్ధమైంది. అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనలో ప్రాణ నష్టం జరగలేదు.. కానీ వ్యాపారులకు భారీ ఆర్థిక నష్టం వాటిల్లినట్లుగా అంచనా వేస్తున్నారు.