అమరావతి : ఏపీలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ( Road Accident) ముగ్గురు దుర్మరణం చెందారు. కాకినాడ ( Kakinada) జిల్లా తుని వద్ద జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని కారు ఢీకొనగా ఈ ప్రమాదం జరిగింది. కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు చనిపోగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతులు రాజమహేంద్రవరం అపోలో ఫార్మసీ ( Apollo Pharmacy ) ఉద్యోగులుగా పోలీసులు గుర్తించారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.