అమరావతి : ఏపీలోని అనంతపురం జిల్లాలో (Anantapur District) శనివారం మధ్యాహ్నం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఏడుగురు దుర్మరణం చెందారు. గార్లదిన్నె మండలం కలగాసపల్లె వద్ద ఆర్టీసీ బస్సు (RTC Bus) వ్యవసాయ కూలీలతో వెళ్తున్న ఆటోను (Auto) ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఘటనా స్థలంలో ఇద్దరు, ఆస్పత్రికి తరలిస్తుండగా మరో ఇద్దరు మృతి చెందారు
. గాయపడ్డ మరికొందరిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో ముగ్గురు మృతి చెందారు. మృతులు రాంజమనమ్మ, బాల తాతయ్య, డి. నాగమ్మ, పెద్ద నాగన్న, కొండమ్మ, జయరాముడు, చిన నాగన్నలుగా గుర్తించారు. ఘటనాస్థలాన్ని ఎస్పీ జగదీశ్ పరిశీలించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి ..
అనంతపురం రోడ్డు ప్రమాదంపై ఏపీ సీఎం చంద్రబాబు(CM Chandra Babu) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు.