అమరావతి : తిరుపతి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జిల్లాలోని శ్రీకాళహస్తి ఏర్పేడు మార్గం మిట్టకండ్రిగ వద్ద ఆదివారం కారు లారీని ఢీకొన్న ప్రమాదంలో ఆరుగురు మృత్యువాత పడ్డారు. ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో ముగ్గురు మహిళలు ఉన్నారు.
బాధితులు విజయవాడకు చెందినవారుగా గుర్తించారు.ఎదురుగా వచ్చిన లారీని కారు ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. గాయపడ్డ వారిని హుటాహుటినా ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. అతివేగంతో ప్రమాదానికి కారణమని తెలుస్తుంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.