అమరావతి : ఏపీలో ఓ కుటుంబం ఆర్థిక ఇబ్బందుల వల్ల ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టింది. ఈ ఘటనలో అత్త, అల్లుడు దుర్మరణం చెందగా భార్య, కూతురు పరిస్థితి విషమంగా ఉంది. చిత్తూరు జిల్లా కుప్పంకు ( Kuppam ) చెందిన లక్ష్మణమూర్తి కుటుంబం బుధవారం తమిళనాడు రాష్ట్రంలోని కృష్ణగిరిలో కేఆర్పీ డ్యామ్ ( KRP Dam ) పై నుంచి నీళ్ల దూకి ఆత్మహత్యకు ( Suicide ) పాల్పడ్డారు.
ఈ ఘటనలో లక్ష్మణ మూర్తి , అత్త శారదమ్మ మృత్యువాత పడగా లక్ష్మణమూర్తి భార్య జ్యోతి, కుమార్తె కీర్తికను స్థానికులు కాపాడారు. వీరిని కృష్ణగిరి ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రిలో చేర్పించారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.