Kurnool Bus Accident | కర్నూలు బస్సు ప్రమాదానికి ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న మద్యం పాలసీలు, లిక్కర్ షాపులే కారణమని సోషల్‌మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని ఏపీ ప్రభుత్వం ఖండించింది. ఉద్దేశపూర్వకంగా దుష్ప్రచారం చేస్తే చట్టప్రకారం చర్యలు తప్పవని హెచ్చరించింది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వ ఫ్యాక్ట్ చెక్ విభాగం ఎక్స్‌లో పోస్టు పెట్టింది.
కర్నూలు జిల్లా చిన్న టేకూరు వద్ద దురదృష్టవశాత్తు జరిగిన బస్సు ప్రమాదం ఘటనపై సాక్షి పత్రిక లో, వైసీపీ సోషల్ మీడియాలో చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఆక్షేపిస్తున్నామని తెలిపింది. రాష్ట్రంలో బెల్ట్ షాపులు పెరిగి పోయాయని, బస్సు ప్రమాదానికి కారణమైన ద్విచక్ర వాహనదారుడు బెల్ట్ షాపుల్లో మద్యం కొనుగోలు చేసి తాగడం వల్లే ప్రమాదం జరిగిందని చేస్తున్న ప్రచారం అవాస్తవమని పేర్కొంది. బైకర్ పెద్దటేకూరు గ్రామంలోని లైసెన్స్డ్ రిటైల్ మద్యం దుకాణంలో రాత్రి 7 గంటలకు ఒకసారి, 8.25 గంటలకు మరొకసారి మద్యం కొనుగోలు చేసినట్లు సీసీ కెమెరాల ఆధారంగా వెల్లడైందని చెప్పింది. గౌరవ సుప్రీం కోర్టు ఆదేశాలు, ఏపీ ఎక్సైజ్ నిబంధనల ప్రకారం సదరు లైసెన్స్డ్ రిటైల్ మద్యం దుకాణం జాతీయ రహదారి కి 240 మీటర్ల కన్నా ఎక్కువ దూరం లోనే ఉందని తెలిపింది. ఆ ప్రాంతంలో ఎక్కడా బెల్ట్ షాపులు లేవని స్పష్టం చేసింది. ప్రమాదం జరిగింది తెల్లవారు జామున అని.. వాస్తవాలు ఇలా ఉండగా తప్పుడు ప్రచారం చేయడం నేరమని తెలిపింది. ఇలా అవాస్తవాలు ప్రచారం చేసేవారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
కర్నూలు జిల్లా చిన్న టేకూరు వద్ద దురదృష్టవశాత్తు జరిగిన బస్సు ప్రమాదం ఘటనపై సాక్షి పత్రిక లో, వైసీపీ సోషల్ మీడియాలో చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఆక్షేపిస్తున్నాం. రాష్ట్రం లో బెల్ట్ షాపులు పెరిగి పోయాయని, బస్సు ప్రమాదానికి కారణమైన ద్విచక్ర వాహనదారుడు బెల్ట్ షాపుల్లో… pic.twitter.com/0x3RCxK53m
— FactCheck.AP.Gov.in (@FactCheckAPGov) October 26, 2025