అమరావతి : ఏపీలోని అనంతపురం జిల్లాలో ఒక ఫ్యాక్టరీలో పేలుడు సంభవించింది. ఆ సమయంలో కార్మాకులు బయటకు వెళ్లడంతో పెను ప్రమాదం తప్పింది.ఆదివారం జిల్లాలోని యాడికి పెన్నా సిమెంట్‌కు చెందిన ఫ్యాక్టరీలోని బొగ్గుతో మండే గొట్టం వేడి పెరగడంతో పేలుడు సంభవించింది.
ఫ్యాక్టరీలో పనిచేస్తున్న కార్మికులు టీ తాగేందుకు బయటకు వెళ్లడంతో ఒక్కసారిగా గొట్టం పేలింది.దీంతో ప్రాణ నష్టం తప్పింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేస్తున్నారు.