Gone Prakash Rao | ఏపీలో రాష్ట్రపతి పాలన అసాధ్యమని మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాశ్ రావు అన్నారు. మాజీ సీఎం వైఎస్ జగన్ రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేయడం చూస్తుంటే.. రాజకీయాల్లో ఆయనకు ఓనమాలు తెలియనవే భావన కలుగుతుందని విమర్శించారు. జగన్ మాటలకు జనాలు నవ్వుకుంటున్నారని అన్నారు. దివంగత నేత వైఎస్సార్ తనకు భగవంతుడితో సమానమని.. దయచేసి ఇలాంటి డిమాండ్లు చేసి నవ్వుల పాలు కావద్దని సూచించారు.
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడితో ఇటీవల సమావేశం కావడం పట్ల కూడా గోనె ప్రకాశ్ రావు స్పందించారు. మాజీ ఎమ్మెల్యేగా చంద్రబాబును మర్యాదపూర్వకంగానే కలిశానని అన్నారు. ఏమీ ఆశించి ముఖ్యమంత్రిని కలవలేదని.. ఎలాంటి రాజకీయ పదవులు తీసుకునే ఉద్దేశం తనకు లేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం తాను ఓల్డ్ ఏజ్ హోమ్‌లో ఉంటున్నానని.. తాను చనిపోయేంత వరకు వృద్ధాశ్రమంలోనే ఉంటానని పేర్కొన్నారు. తాను ఒక రాజకీయ విశ్లేషకుడిని మాత్రమేని స్పష్టం చేశారు.