Ambati Rambabu | మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబు తిరుమల పర్యటన చర్చనీయాంశమైంది. తిరుమల శ్రీవారిని సోమవారం ఉదయం అంబటి రాంబాబు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన జగన్ బొమ్మతో ఉన్న స్టిక్కర్ అతికించిన చొక్కాను వేసుకుని దర్శనానికి వెళ్లారు. ఇది కాస్త వివాదాస్పదంగా మారింది.
సాధారణంగా తిరుమలలో రాజకీయ పార్టీల జెండాలు, బొమ్మలతో రావడం నిషిద్ధం. కానీ ఈ నిబంధనను పట్టించుకోకుండా మాజీ మంత్రి అంబటి రాంబాబు.. జగన్ ఫొటోతో ఉన్న స్టిక్కర్ అతికించిన చొక్కాను వేసుకుని దర్శనానికి వచ్చారు. దీనిపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తిరుమలలో ఉన్న సంప్రదాయాలను పట్టించుకోకపోవడంపై మండిపడుతున్నారు. పైగా జగన్ బొమ్మతో పాటు వైసీపీ గుర్తు ఉన్న బ్యాడ్జితోనే ఆలయంలోకి వెళ్లి స్వామివారిని దర్శించుకున్నప్పటికీ భద్రతా సిబ్బంది పట్టించుకోలేదు. దీనిపై కూడా పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
Ex minister and @YSRCParty leader @AmbatiRambabu has visited Tirumala Lord #Balaji with his leader @ysjagan ‘s badge on his pocket. Another controversy pic.twitter.com/wN3ic8uxG9
— Lokesh journo (@Lokeshpaila) November 4, 2024