Kiran Kumar Reddy | తెలంగాణ రాష్ట్ర విభజనపై ఉమ్మడి ఏపీ చివరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి బతికి ఉంటే రాష్ట్ర విభజన జరిగి ఉండేది కాదని చాలా మంది అనుకుంటూ ఉంటారని కిరణ్‌కుమార్ రెడ్డి అన్నారు. రాజశేఖర్ రెడ్డి బతికున్నా తెలంగాణ ఏర్పాటు ఆగేది కాదని తెలిపారు. ఏపీలోని విజయవాడలో జరిగిన సంక్రాంతి ఆత్మీయ సమ్మేళనంలో కిరణ్‌కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. 2014లో కాదు.. అసలు 2009లోనే తెలంగాణ రాష్ట్రం రావాల్సి ఉండేదని పేర్కొన్నారు.
రాష్ట్ర విభజనకు వ్యతిరేకం కాదనే తీర్మానాన్ని రాజశేఖరరెడ్డి హయాంలోనే కాంగ్రెస్ అధిష్ఠానం పెట్టించాలని చూసిందని కిరణ్ కుమార్ రెడ్డి సంచలన విషయాన్ని వెల్లడించారు. తాను చీఫ్ విప్గాఉన్నప్పుడు రాజశేఖరరెడ్డి పిలిచి.. ‘మనం తెలంగాణ రాష్ట్రానికి అనుకూలం’ అనే తీర్మానాన్ని అసెంబ్లీలో పెట్టాలని చెప్పారని తెలిపారు. ఎన్నికల ముందు మనం ఈ తీర్మానాన్ని పెడితే మనం ఓడిపోతామని వైఎస్‌తో తాను చెప్పాననని అన్నారు. ‘నా చేతుల్లో ఏమీ లేదు. రాష్ట్ర విభజన చేయాలని ప్రణబ్ ముఖర్జీ చెప్పారు’ అని వైఎస్ఆర్ తనతో అన్నారని చెప్పారు. దీంతో తాము ప్రణబ్ ముఖర్జీతో మాట్లాడామని.. ‘మేం తెలంగాణకు అనుకూలం’ అనే తీర్మానాన్ని ‘మేం తెలంగాణకు వ్యతిరేకం కాదు’ అని మార్చి పెట్టామని వెల్లడించారు.
రాజశేఖర్ రెడ్డి బతికున్నా తెలంగాణ ఏర్పాటు ఆగేది కాదు!
2014 కాదు తెలంగాణ 2009 లోనే రావాల్సి ఉండేది
రాజశేఖరరెడ్డి బతికి ఉంటే రాష్ట్ర విభజన జరిగి ఉండేది కాదని చాలా మంది అనుకుంటూ ఉంటారని… కానీ, రాష్ట్ర విభజనకు వ్యతిరేకం కాదు అనే తీర్మానాన్ని రాజశేఖరరెడ్డి హయాంలోనే కాంగ్రెస్… pic.twitter.com/mythM9keEm
— Telugu Scribe (@TeluguScribe) January 13, 2025
రాష్ట్ర విభజన జరగదనే తాము అనుకున్నామని.. దురదృష్టవశాత్తు రాష్ట్రం విడిపోయిందని కిరణ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు. వైఎస్ ఉన్నా రాష్ట్ర విభజన ఆగేది కాదని పునరుద్ఘాటించారు.