అమరావతి : మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి(YS Viveka) హత్య కేసులో(Murder Case) ప్రధాన నిందితుడు ఎర్ర గంగిరెడ్డి(Yerra Gangireddy) కోర్టులో లొంగిపోయాడు (Surrender). హైదరాబాద్ నాంపల్లిలోని లోని సీబీఐ కోర్టులో(CBI Court) లొంగిపోగా ఆయనకు జూన్ 2వ తేదీ వరకు రిమాండ్ విధించింది. అతడిని చంచల్‌గూడ జైలుకు తరలించారు. తెలంగాణ హైకోర్టు ఇటీవల గంగిరెడ్డి బెయిల్ రద్దు చేయడంతో పాటు 5వ తేదీలోగా లొంగిపోవాలని కోర్టు ఆదేశాలతో పాటు లాయర్ సలహా మేరకు లొంగిపోయినట్లు గంగిరెడ్డి వెల్లడించారు. వైఎస్ వివేకా హత్య కేసుంలో 2019 మార్చి 28న పోలీసులు గంగిరెడ్డిని అరెస్టు చేశారు.
అరెస్ట్ చేసిన 90 రోజులు గడచినా చార్జిషీట్(ChargeSheet) దాఖలు చేయకపోవడంతో 2019 జూన్ 27న కోర్టు డీఫాల్ట్ బెయిల్ మంజూరు చేసింది. అతడి బెయిల్‌ను రద్దు చేయాలని సీబీఐ కోర్టును ఆశ్రయించగా కోర్టు పిటిషన్‌ను కొట్టేసింది. దీంతో సుప్రీం కోర్టు(Supreme Court)లో సీబీఐ అప్పీల్ చేసుకుంది. గంగిరెడ్డిపై తీవ్ర ఆరోపణలు ఉన్నాయని వాదనలు వినిపించింది. ఒకవేళ ఆధారాలు ఉంటే డీఫాల్ట్ బెయిల్ రద్దు చేయొచ్చని సుప్రీం కోర్టు పేర్కొంది. బెయిల్ రద్దు పిటిషన్‌పై విచారణ చేసి నిర్ణయం తీసుకోవాలని ఏపీ హైకోర్టును ఆదేశించింది.
ఆ తర్వాత సుప్రీం కోర్టు ఆదేశాలతో వివేకా హత్య కేసు తెలంగాణకు బదిలీ కావడంతో తెలంగాణ హైకోర్టుకు బదిలీ అయ్యింది. సీబీఐ కోర్టులో వాదనలు వినిపించింది. ఎర్ర గంగిరెడ్డి సాక్ష్యులను ప్రభావితం చేసే ప్రయత్నం చేస్తున్నారని సీబీఐ అభ్యంతరం తెలిపింది. సాక్ష్యులను బెదిరించే ప్రయత్నాలు చేశారని.. సాక్షాలను తారుమారు చేస్తున్నారని వాదనలు వినిపించింది. దీంతో తెలంగాణ హైకోర్టు(Telangana High Court) గంగిరెడ్డి బెయిల్ రద్దు చేసింది. ఈ నెల 5లోపు కోర్టులో లొంగిపోవాలని సూచించింది. దీంతో ఆయన సీబీఐ కోర్టులో లొంగిపోయారు.