Srinivasa Rao | శ్రీశైలం జులై 22 : శ్రీశైల జలాశయానికి అనుబంధంగా ఉండే ఎడమగట్టు జలవిద్యుత్ కేంద్రం దేశంలోనే ప్రత్యేక స్థానం ఉందని మల్లికార్జునస్వామి ఆలయ ఈవో శ్రీనివాసరావు అన్నారు. మంగళవారం క్రస్ట్ గేటును తెరిచిన అనంతరం భూగర్భ జలవిద్యుత్ కేంద్రాన్ని చీఫ్ ఇంజినీయర్ కేవీవీ సత్యనారాయణ ఆధ్వర్యంలో యానిట్లతో పాటు నాలుగు అంతస్థులను ఆయన సందర్శించారు. యూనిట్ల పనితీరుతోపాటు అధునిక సాంకేతిక సర్దుబాట్లను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా నిరంతర విద్యుత్ ఉత్పత్తి కొనసాగాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా అధికారులకు స్వామిఅమ్మవార్ల ప్రసాదాలు, శేషవస్త్రాలు అందించారు.