అమరావతి : ప్రమాదాలు ఏ వైపు నుంచి ముంచుకొస్తుందో తెలియని పరిస్థితి దాపురిస్తుంది. విద్యార్థి బ్యాగ్ (Student Bag) ప్రమాదవశాత్తు లారీ హుక్కు తగిలి దుర్మరణం చెందిన విషాద ఘటన విజయవాడలో చోటు చేసుకుంది. మంగళవారం రాత్రి విజయవాడ (Vijayawada) లోని చనుమోలు వెంకట్రావు పైవంతెనపై ఓ లారీ ద్విచక్రవాహనాన్ని ఢీ కొట్టింది.
ఈ ప్రమాదంలో కంచికచర్లకు చెందిన హర్షవర్ధన్ అనే ఇంజినీరింగ్ విద్యార్థి(Engineering Student) బ్యాగ్ లారీ ట్రాలీ హుక్కు చిక్కుకుంది. కొంతదూరం ఈడ్చుకెళ్లిన తర్వాత యువకుడు లారీ చక్రాల కిందపడి మృతి చెందడం స్థానికుల కంట కన్నీరు తెప్పించింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని , మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు.