Student Suicide | రుణ యాప్ నిర్వాహకుల వేధింపులతో ఇంజినీరింగ్ విద్యార్థి ఆత్మహత్య
Student Suicide | రుణ యాప్ నిర్వాహకుల వేధింపులకు మరో విద్యార్థి బలి అయ్యాడు. విజయవాడకు చెందిన ఇంజినీరింగ్ విద్యార్థి కృష్ణానదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.
అమరావతి : రుణ యాప్ నిర్వాహకుల వేధింపులకు మరో విద్యార్థి బలి (Student Suicide) అయ్యాడు. విజయవాడకు చెందిన ఇంజినీరింగ్ విద్యార్థి (Engineering student ) కృష్ణానదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాలు ఇలా ఉన్నాయి. మురికింటి వంశీ(22) అనే విద్యార్థి చివరి ఏడాది ఇంజినీరింగ్ చదువుతున్నాడు. అవసరపు నిమిత్తం రుణ యాప్ (Loan app) నుంచి రూ.10 వేలు తీసుకోగా రూ. లక్ష కట్టాలని రుణ యాప్ నిర్వాహకుల నుంచి ఒత్తిళ్లు, బెదిరింపులు మొదలయ్యాయి.
ఇంటిలో తల్లిదండ్రులకు చెబితే బాధపడుతున్నారన్న భయంతో ఈనెల 25న ఇంటి నుంచి వెళ్లిపోయాడు. తాను చనిపోతున్నానంటూ మేసేజ్ పంపి ఫోన్ స్విచ్ఛాఫ్ చేసి తాడేపల్లి వద్ద కృష్ణానది (Krishna river) లో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. వంశీ కోసం రెండు రోజులుగా కుటుంబ సభ్యుల గాలింపు చర్యలు చేపట్టినా ఫలితం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.
సెల్ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా పోలీసులు సెల్ఫోన్, చెప్పులు, బైక్ తాడేపల్లిలో కృష్ణా నది వద్ద సోమవారం గుర్తించారు. తండ్రి ఫిర్యాదుతో నదిలో విద్యార్థి మృతదేహాన్ని గాలించి బయటకు తీశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prabhas | ‘రణబాలి’ మిక్స్డ్ టాక్.. ‘ఫౌజీ’తోనైనా ప్రభాస్ కొత్త ట్రెండ్ సృష్టిస్తారా?
Dorothy OTT | ఓటీటీలోకి కీర్తి సురేష్ ‘డోరతి’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!
Bear attacks | తంగేడు పువ్వు కోసం వెళ్లిన వ్యక్తిపై ఎలుగుబంటి దాడి.. తీవ్ర గాయాలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

