అమరావతి : యూనివర్సిటీ నిధుల మళ్లింపునకు నిరసనగా బుధవారం వర్సిటీ ఉద్యోగులు విధులను బహిష్కరించారు. ఏపీ జగన్ ప్రభుత్వం ప్రభుత్వ సంస్థలు, విశ్వవిద్యాలయాలు, విద్యా సంస్థలకు చెందిన నిధులను ఏపీ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్‌కు మళ్లించడంపై ఉద్యోగులు మంగళవారం సమావేశమై జేఏసీగా ఏర్పడి ఆందోళనకు పిలుపునిచ్చాయి . దీంట్లో భాగంగా బుధవారం విధులను బహిష్కరించిన ఉద్యోగులు ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ప్రభుత్వ నిర్ణయంతో ఉద్యోగులను, వర్సిటీని రోడ్డున పడేస్తున్నారని జేఏసీ నాయకులు ఆరోపించారు. ప్రభుత్వం మళ్లించుకున్న రూ.400 కోట్లు వెంటనే వెనక్కి ఇవ్వాలని డిమాండ్ చేశారు. నిధుల మళ్లింపు వ్యవహారంపై సీబీఐ విచారణ వేయాలని కోరారు.