అమరావతి : వైకుంట ఏకాదశి సందర్భంగా ఈనెల 10 నుంచి తిరుమలలో (Tirumala) ప్రారంభం కానున్న వైకుంఠ ద్వారా దర్శనానికి అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు. ముందెన్నడూ లేనివిధంగా 9 రోజుల పాటు ఆలయాన్ని సుందరంగా ముస్తాబు చేయడంతో సామాన్య భక్తులకు పాటు సులభతరంగా వైకుంఠ ద్వార దర్శనం కల్పించేందుకు సన్నహాలు చేస్తున్నారు.
ఈసారి ప్రసిద్ధ మైసూర్ (Mysore) దసరా ఉత్సవాలలో పుష్ప,విద్యుత్ దీపాలంకరణలు (Electric lamp decorations) అందించే మైసూర్ నిపుణులు తిరుమల, తిరుపతిలలో విద్యుత్ , ప్రత్యేకమైన పౌరాణిక పాత్రలతో కూడిన పూల అలంకరణలు ఏర్పాటు చేయనున్నారు.
ఏకాదశి పర్వదినంపై మాస్టర్ డాక్యుమెంట్ను (Master Documents) రూపొందించారు. ఇది ప్రస్తుత భవిష్యత్తు సంవత్సరాలకు అవసరాలకు అనుగుణంగా పనిచేసేందుకు టీటీడీ ఈవో (TTD EO ) జె.శ్యామలరావు, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి సుదీర్ఘంగా సమీక్షించారు.
తిరుపతి , తిరుమలలో ఎస్ఎస్డీ టోకెన్ల జారీ, శ్రీవారి ఆలయంలో కైంకర్యాల నిర్వహణ, భక్తుల భద్రత, దర్శనం, వసతి, పార్కింగ్ సౌకర్యాలు, ట్రాఫిక్ నిర్వహణ, అన్నప్రసాదం, ఇతర ప్రధాన అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ కార్యక్రమంలో సీఈ సత్యనారాయణ, ఐటీ జీఎం శేషారెడ్డి, తిరుమల అడిషనల్ ఎస్పీ రామకృష్ణ ఇతర అధికారులు పాల్గొన్నారు.