KA Paul | ప్రజాశాంతి పార్టీకి గుర్తు మార్చేసిన ఈసీ.. సొంతంగా కుండ తయారు చేసిన కేఏ పాల్
KA Paul | ప్రజాశాంతి పార్టీకి ఎన్నికల కమిషన్ కొత్త గుర్తు కేటాయించింది. ఇన్నాళ్లు ఆ పార్టీకి హెలికాప్టర్ గుర్తు ఉండేది. కానీ రాబోయే ఎన్నికల్లో ప్రజాశాంతి పార్టీకి హెలికాప్టర్ గుర్తును కాకుండా.. మట్టికుండ గుర్తును కేటాయించింది. ఈ విషయాన్ని ఆ పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ స్వయంగా వెల్లడించారు.
KA Paul | ప్రజాశాంతి పార్టీకి ఎన్నికల కమిషన్ కొత్త గుర్తు కేటాయించింది. ఇన్నాళ్లు ఆ పార్టీకి హెలికాప్టర్ గుర్తు ఉండేది. కానీ రాబోయే ఎన్నికల్లో ప్రజాశాంతి పార్టీకి హెలికాప్టర్ గుర్తును కాకుండా.. మట్టికుండ గుర్తును కేటాయించింది. ఈ విషయాన్ని ఆ పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ స్వయంగా వెల్లడించారు. విశాఖపట్నంలోని రైల్వే న్యూ కాలనీలోని పార్టీ కార్యాలయంలో శుక్రవారం కేఏ పాల్ మీడియాతో మాట్లాడారు. మకు కుండ గుర్తు ఇచ్చిన ఈసీకి, ఆ గుర్తు ఇవ్వాలని ఆదేశించిన ఏపీ, తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తులకు ధన్యవాదాలు తెలిపారు.
ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని ఏప్రిల్ 10వ తేదీన కేంద్ర ఎన్నికల సంఘం తమకు కుండ గుర్తు కేటాయించిందని కేఏ పాల్ మీడియాకు వెల్లడించారు. స్వయంగా ఓ కుండను తయారుచేసుకుని మరీ ప్రెస్‌మీట్‌కు వచ్చి తన గుర్తును చూపించారు. ప్రతి ఒక్కరూ ఈ కుండ గుర్తును తమ మనసుల్లో నింపుకొని.. జీవితాలను మార్చుకోవాలని అన్నారు. శాంతి పాలన రావాలంటే.. కుండ పాలన రావాలని తెలిపారు. ఫ్యాన్‌కు ఉరివేసుకుని చాలామంది చనిపోయారని.. గ్లాసులు పగిలిపోయి చాలామందికి హాని జరిగిందని.. సైకిళ్లు యాక్సిడెంట్లు అయి వందల వేల మంది చనిపోయారని.. అదే కుండ తన మంచినీటితో కోట్ల మందికి ప్రాణాన్ని ఇచ్చిందంటూ.. రాజకీయ ప్రత్యర్థులపై సెటైర్లు వేశారు. తాను అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో అందరికీ ఉచిత విద్య, వైద్యం అందిస్తామని.. నిరుద్యోగులందరికీ ఉపాధి కల్పిస్తామని అన్నారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTRs Meeting | కేటీఆర్ సభకు భారీగా తరలిన బీఆర్ఎస్ శ్రేణులు
Modi Cabinet | రైల్వే ఉద్యోగులకు మోదీ క్యాబినెట్ శుభవార్త.. 78 రోజుల బోనస్ ప్రకటన
మేగ్యతండాలో మహిళా శక్తి భవనం పరిశీలన
డిండి ఎత్తిపోతల రద్దు చేస్తే పెద్ద ఎత్తున ఉద్యమం : మాజీ ఎమ్మెల్యే కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి
Kethireddy Vasudeva reddy | దొర అహంకారంతో వ్యవహరిస్తున్న బల్మూరి వెంకట్ : డాక్టర్ కేతిరెడ్డి వాసుదేవ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

