హైదరాబాద్, ఆగస్టు 3 (నమస్తే తెలంగాణ): ఏపీలో ఎన్నికల ప్రక్రియకు ఎన్నికల కమిషన్ శ్రీకారం చుట్టింది. ఈ మేరకు రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల వారీగా ఎన్నికల అధికారులను నియమిస్తూ గెజిట్ నోటిఫికేషన్ను జారీ చేసింది. వచ్చే ఏడాది ఏప్రిల్-మే నెలల్లో అక్కడ ఎన్నికలు జరగాలి.
తాజాగా ఈసీ అన్ని నియోజకవర్గాల్లోనూ రిటర్నింగ్ అధికారులు, ఈఆర్వోలు, ఏఈఆర్వోలను నియమిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో ఈలోపే జమిలి లేదా ముందస్తు ఎన్నికలు జరగవచ్చనే ఆసక్తి నెలకొన్నది.