అమరావతి : సార్వత్రిక ఎన్నికలు పూర్తికావడంతో కేంద్ర ఎన్నికల సంఘం (Central Election Commission) ఎన్నికల కోడ్ (Election code) ఎత్తివేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల ప్రక్రియ పూర్తి కావడంతో గురువారం సాయంత్రం 6 గంటల నుంచి కోడ్ ముగిసినట్లు ఈసీ వెల్లడించింది. మార్చి 16 నుంచి దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమలులోకి రాగా గురువారం నాటికి కోడ్ అమలు ముగిసింది. దాదాపు 51 రోజుల పాటు దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమలు అయ్యింది.
ఏపీలోనూ అసెంబ్లీ (Assembly), పార్లమెంట్ (Parliament) ఎన్నికల సందర్భంగా రాష్ట్ర ఎన్నికల సంఘం ఏప్రిల్ 18న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆ రోజు నుంచి ప్రారంభమైన ఎన్నికల నామినేషన్ ప్రక్రియ ఏప్రిల్ 25న ముగిసింది. 26న స్క్రూట్ని, 29 వరకు ఉపసంహరణ ప్రక్రియ జరిగింది. అనంతరం మే 15న ఎన్నికలు జరుగగా, 20 రోజుల తరువాత జూన్ 4న ఫలితాలు వెలువడ్డాయి.