Tirumala | తిరుమలలో మరోసారి అపచారం జరిగింది. శ్రీవారి ఆలయంపై డ్రోన్ కెమెరా కలకలం సృష్టించింది. దాదాపు 10 నిమిషాల పాటు ఆలయ పరిసరాల్లో డ్రోన్ కెమెరా చక్కర్లు కొట్టడం గమనించిన భక్తులు విజిలెన్స్ అధికారులు సమాచారం ఇచ్చారు. దీంతో డ్రోన్ ఎగరవేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.
డ్రోన్ కెమెరా ఎగరవేసిన భక్తుడిని రాజస్థాన్‌కు చెందిన అన్షుమన్ తరేజా అనే యూట్యూబర్‌గా టీటీడీ విజిలెన్స్ సిబ్బంది గుర్తించారు. మంగళవారం సాయంత్రం శ్రీవారి ఆలయం ఎదురుగా ఉన్న హరినామ సంకీర్తన మండపం వద్ద డ్రోన్ ఎగురవేశాడని టీటీడీ తెలిపింది. సమాచారం అందుకున్న వెంటనే అతడిని అదుపులోకి తీసుకుని, డ్రోన్‌ను స్వాధీనం చేసుకుని పోలీసులకు అప్పగించినట్లు పేర్కొంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, డ్రోన్ కెమెరాతో చిత్రీకరించిన దృశ్యాలను టీటీడీ విజిలెన్స్ అధికారులు పరిశీలించారు. ఇవాళ ఉదయం నుంచి తిరుమలలో ఇలాగే అతను వీడియోలు తీస్తున్నట్లుగా గుర్తించారు.
తిరుమల ఆలయంపై డ్రోన్ కలకలం#DroneVideo #TTD #Tirumala pic.twitter.com/tx2w0ZvSRi
— MADAM MEERU SIR AA (@shra1way2) April 15, 2025