Kakinada Accident | కాకినాడ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కత్తిపూడి హైవేపై రెండు కంటైనర్ లారీలు ఢీకొన్నాయి. దీంతో ఇంజిన్ నుంచి మంటలు చెలరేగి రెండు లారీల ముందు భాగం పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటనలో ఒకరు సజీవ దహమవ్వగా.. ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.
వివరాల్లోకి వెళ్తే.. భీమవరం నుంచి మూలసేటకు ఆక్వా మేతతో వెళ్తున్న ఓ కంటైనర్ కత్తిపూడి జంక్షన్ వద్ద మలుపు తీసుకుంటుండగా.. కాటన్ వేస్ట్ బండిల్స్ లోడ్‌తో కోల్‌కతా నుంచి చెన్నై వెళ్తున్న మరో కంటైనర్ ఢీకొట్టింది. దీంతో కంటైనర్ ముందు భాగాల్లో మంటలు చెలరేగి, ముందు భాగాలు దగ్ధమయ్యాయి. ఈ ఘటనలో కాటన్ లారీ డ్రైవర్ కమల్ షేక్ (43) సజీవ దహనం అయ్యాడు. మరో ఇద్దరు గాయపడ్డారు.
ప్రమాదం గురించి సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. సజీవ దహనమైన లారీ డ్రైవర్ కోల్‌కతాకు చెందిన వ్యక్తిగా పోలీసులు నిర్ధారించారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.