అమరావతి : విభజన సమస్యలను(Division Issues) పరిష్కరించుకునేందుకు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య చర్చలు జరగడం శుభపరిణామని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ (CPI Narayana) అన్నారు. నిన్న హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌లో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు(Chandra Babu), తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy) , మంత్రులు, సీఎస్‌లు సమావేశమైన రెండు గంటల పాటు విభజ సమస్యల పరిష్కారానికి చర్చలు జరిపిన విషయం తెలిసిందే.
అనంతపురంలో పర్యటిస్తున్న నారాయణ మీడియాతో మాట్లాడుతూ సమస్యలు పరిష్కరించడానికి కమిటీలు వేయడం స్వాగతిస్తున్నామని పేర్కొన్నారు. అవసరమైతే ఇచ్చిపుచ్చుకునే ధోరణిని కనబరచాలని సూచించారు. కొంత మంది చేసే రెచ్చగొట్టే వ్యాఖ్యలను ఇరువురు పట్టించుకోవద్దని వెల్లడించారు.
అన్నీ కూడా సీఎంలు కూర్చుని పరిష్కరించేవి కావని, అధికారుల స్థాయిలోనూ పరిష్కారమవుతాయని అన్నారు. ఇరు రాష్ట్రాలు నేలపై ఆలోచించి సమస్యలను పరిష్కరించుకోవాలని అన్నారు. చిన్నచిన్న విషయాలను భూతద్దంలో పెట్టి చూడవలసిన అవసరం లేదని వ్యాఖ్యనించారు.