తిరుమల : కలియుగ ప్రత్యక్షదైవం కొలువుదీరిన తిరుమల ( Tirumala ) వేంకటేశ్వరుడికి చెన్నైకు ( Chennai) చెందిన భక్తుడు భారీ విరాళం ( Donation ) అందించాడు. వర్ధమాన్ జైన్ అనే భక్తుడు శనివారం టీటీడీ ఎస్వీ అన్న ప్రసాదం ట్రస్టుకు ( Annaprasadam Trust ) రూ.1.01 కోట్లు, ప్రాణదాన ట్రస్ట్‌కు రూ.1.01 కోట్లు విరాళంగా అందించి స్వామివారి పట్ల ఉన్న భక్తిని చాటుకున్నారు. ఆ మేరకు దాత డీడీలను శ్రీవారి ఆలయంలో వ్యాసరాజ మఠాధిపతి విద్యాశ్రీశ తీర్థ స్వామీజీ సమక్షంలో టీటీడీ అడిషనల్ ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరికి అందజేశారు.
తిరుమలలో శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం
తిరుమల : తిరుమలలో (Tirumala) భక్తుల రద్దీ కొనసాగుతుంది. వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు 16 కంపార్టుమెంట్లలో (Compartments) వేచియున్నారు. టోకెన్లు లేని భక్తులకు 8 గంటల్లో సర్వదర్శనం అవుతుందని టీటీడీ అధికారులు (TTD ) వివరించారు.
నిన్న స్వామవారిని 63,731 మంది భక్తులు దర్శించుకోగా 22,890 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న మొక్కుల ద్వారా హుండీకి రూ. 3.94 కోట్లు ఆదాయం (Income) వచ్చిందన్నారు.