Srisailam | మహాశివరాత్రి సందర్భంగా శ్రీశైలంలో భక్తుల రద్దీ కారణంగా దోర్నాల, మన్ననూర్ చెక్ పోస్టు నుంచి శ్రీశైలం వెళ్లే బస్సులు, ఇతర వాహనాలను అనుమతించబోమని నంద్యాల జిల్లా కలెక్టర్ రఘువీర్ వెల్లడించారు. ఇవాళ ( శుక్రవారం ) రాత్రి 9 గంటల నుంచి రేపు ఉదయం తెల్లవారుజామున 5 గంటల వరకు వాహనాలను అనుమతించమని తెలిపారు.
దోర్నాలలో వేచివున్న ప్రయాణిలకు దేవస్థానం తరపున అల్ఫాహారం ఏర్పాటు చేస్తామని తెలిపారు. తదననుగుణంగా ప్రయాణికులు తమ ప్రయాణాన్ని ఏర్పాటు చేసుకోవాల్సిందిగా సూచించామని తెలిపారు. దయచేసి ప్రయాణికులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.