అమరావతి : ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ( Chandrababu ) పర్యటనలో అపశ్రుతి చోటు చేసుకుంది. నెల్లూరు ( Nellore ) జిల్లా బహిరంగ సభ వేదిక వద్ద ఏర్పాటు చేసిన ఆర్చి కుప్పకూలడంతో ప్రమాదం తప్పింది. చంద్రబాబు గురువారం నారంపేటలోని ఎంఎస్ఎంఈ( MSME ) పార్క్ వద్ద ప్రజావేదికను ఏర్పాటు చేశారు. ఇందుకు గాను పోలీసులు, రెవెన్యూ యంత్రాంగం , అధికారులు భారీగా ఏర్పాట్లు పూర్తి చేశారు.
రాష్ట్రంలో తొలిదశలో పూర్తిచేసిన 11 ఎంఎస్ఏఈ పార్కులను ఈ సందర్భంగా చంద్రబాబు ప్రారంభించారు. 2028 నాటికి రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో ఒకటి చొప్పున 175 ఎంఎస్ఎంఈ పార్కులను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించిందని అన్నారు. సభా కార్యక్రమం పూర్తయిన కొద్ది గంటల్లోనే సమీపంలోని ఆర్చి కుప్పకూలడం, ఆ ఆర్చి కూలే సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ఎవరికి ఎలాంటి ప్రమాదం జరుగలేదని స్థానికులు తెలిపారు.