అమరావతి : ఎన్నికల కోడ్ ముగిసే వరకు ఏపీలో వాలంటీర్ల (Volunteers) ద్వారా కాకుండా సచివాలయ సిబ్బందితో పింఛన్ల పంపిణీ చేపట్టాలని సెర్ప్ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. దేశంలో సార్వత్రిక ఎన్నికల కోడ్(Election Code) అమలులోకి రావడంతో రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సెర్ప్ అధికారులు ( SERP officials) తెలిపారు.
గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందితో సచివాలయంలో పింఛన్లు పంపిణీ చేయాలని ఎన్నికల కోడ్ వల్ల వాలంటీర్ల ద్వారా పింఛన్లు పంపిణీ చేయవద్దని సూచించారు. ఎన్నికల కోడ్ ముగిసేవరకు ఇంటింటికీ పింఛన్ల పంపిణీ ఉండదని, పింఛన్(Pensions) లబ్దిదారులు ఆధార్, లేదా ఇతర గుర్తింపు కార్డు సచివాలయానికి తీసుకెళితే వాటిని సచివాలయ సిబ్బంది పరిశీలించి అందజేస్తారని వివరించారు.
వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఏర్పాటు చేసిన వాలంటీర్ల వ్యవస్థ ద్వారా ఇప్పటి వరకు పింఛన్లతో పా పలు కార్యక్రమాలు చేస్తుంది. ఎన్నికల సందర్భంగా వాలంటీర్లు ఓటర్లు ప్రభావితం చేయవచ్చని ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు వెళ్లడంతో వాలంటీర్లను పక్కన పెట్టింది