హైదరాబాద్, నవంబర్ 3 (నమస్తే తెలంగాణ) : తిరుమల పుణ్యక్షేత్రం భక్తులతో కిటకిటలాడుతోంది. కొండపై ఉన్న 31 కంపార్టుమెంట్లు నిండిపోయి శిలాతోరణం వరకు భక్తులు క్యూలో నిలబడ్డారు. ఆదివారం శ్రీవారి ఉచిత దర్శనానికి 25 గంటల సమయం పట్టింది. టైమ్ స్లాట్ దర్శనానికి 6 గంట లు, ప్రత్యేక దర్శనానికి 5 గంటల సమ యం పడుతున్నది.
శనివారం తిరుమల శ్రీవారిని 80 వేల 76 మంది దర్శించుకున్నారు. హుండీ ఆదాయం రూ.3.52 కోట్లు వచ్చిన్నట్టు టీటీడీ అధికారులు తెలిపారు. ఈ నెల 5న నాగుల చవితి సందర్భంగా మలయప్పస్వామి పెద్దశేష వాహనంపై ఉభయ దేవేరులతో కలిసి దర్శనమివ్వనున్నారు. సర్పరాజైన ఆదిశేషువు జగన్నాథునికి నివాస భూమిగా, తల్పంగా, సింహాసనంగా స్వామివారికి విశేష సేవలందించినట్టు పురాణాలు చె బుతున్నాయని అర్చకులు పేర్కొన్నారు.