తిరుమల : తిరుమలలో ( Tirumala ) భక్తుల రద్దీ విఫరీతంగా పెరిగింది. వరుసగాపంద్రాగస్టు, శ్రీ కృష్ణాష్టమి, ఆదివారం సెలవు దినాలు రావడంతో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో శ్రీవారి చెంతకు చేరుకున్నారు. ఈ సందర్భంగా కొండపై ఉన్న అన్ని కంపార్టుమెంట్లు నిండిపోయి గోగర్భం డ్యాం (Gogarbam Dam) వరకు భక్తులు క్యూలైన్లో నిలబడ్డారు. టోకెన్లు లేని భక్తులకు 24 గంటల్లో సర్వదర్శనం అవుతుందని టీటీడీ అధికారులు వివరించారు. నిన్న స్వామివారిని 77,043 మంది దర్శించుకోగా 41,859 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీకి రూ. 3.53 కోట్లు ఆదాయం వచ్చిందని తెలిపారు.
టీటీడీ ఎస్వీ ప్రాణదాన ట్రస్టుకు రూ.10 లక్షలు విరాళం
తిరుమల : హైదరాబాద్‌కు చెందిన ముత్తవరపు నాగరాజు అనే భక్తుడు టీటీడీ వేంకటేశ్వర ప్రాణదాన ట్రస్ట్‌కు రూ.10,00,116 విరాళం అందించారు. ఈ మేరకు దాత తిరుమలలోని టీటీడీ చైర్మన్ క్యాంపు కార్యాలయంలో చైర్మన్ బీ.ఆర్.నాయుడుకు విరాళం డీడీని అందజేశారు.