హైదరాబాద్, సెప్టెంబర్ 3 (నమస్తే తెలంగాణ) : ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా తిరుమలలో భక్తుల రద్దీ భారీగా తగ్గింది. మూడు రోజుల క్రితం వరకు సర్వదర్శనానికి 18 గంటల సమయం పట్టగా.. ప్రస్తుతం 6 గంటల్లోనే దర్శనం పూర్తవుతుంది. టైమ్ స్లాట్ దర్శనానికి 3 గంటలు, రూ.300 ప్రత్యేక దర్శనానికి 2 గంటల సమయం పడుతుంది.
సోమవారం శ్రీవారిని 63,936 మంది భక్తులు దర్శించుకోగా, 18,697 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ.4.55కోట్లు వచ్చింది. వచ్చే నెల 4 నుంచి జరిగే బ్రహ్మోత్సవాల్లో భాగంగా అక్టోబర్ 9 వరకు ఘాట్ రోడ్డులో బైకులకు అనుమతిలేదని టీటీడీ తెలిపింది