తిరుమల : కలియుగ ప్రత్యక్షదైవం వేంకటేశ్వరస్వామి కొలువుదీరిన తిరుమల ( Tirumala) కు భక్తుల రద్దీ కొనసాగుతుంది . వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో 30 కంపార్టుమెంట్లు నిండిపోయాయి. టోకెన్లు లేని భక్తులకు 12 గంటల్లో సర్వదర్శనం అవుతుందని టీటీడీ అధికారులు తెలిపారు.
శుక్రవారం 67,526 మంది భక్తులు దర్శించుకోగా 25,780 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించు కున్న కానుకల వల్ల శ్రీవారి హుండీకి రూ. 3.45 కోట్లు ఆదాయం వచ్చిందన్నారు.
టీటీడీకి రూ.10 లక్షలు విరాళం
గుంటూరుకు చెందిన డాక్టర్ బాలాజీ గుంటుపల్లి అనే భక్తుడు టీటీడీ శ్రీ వేంకటేశ్వర అన్న ప్రసాదం ట్రస్టుకు శుక్రవారం రూ.10,00,116 విరాళంగా అందించారు.ఈ మేరకు దాత తిరుమలలోని టీటీడీ అదనపు ఈవో క్యాంపు కార్యాలయంలో అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరికి విరాళం డీడీని అందజేశారు.