తిరుమల : హైదరాబాద్కు ( Hyderabad ) చెందిన కాప్స్టన్ సర్వీసెస్ సంస్థ అధినేత కొడాలి శ్రీకాంత్ ( Kodali Srikanth ) మంగళవారం టీటీడీ వేంకటేశ్వర అన్న ప్రసాదం ట్రస్టుకు రూ. కోటి, వేంకటేశ్వర గో సంరక్షణ ట్రస్టుకు రూ.10 లక్షలు విరాళంగా అందించారు. ఈ మేరకు శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో టీటీడీ అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరికి విరాళం చెక్కులను అందజేశారు.
టీటీడీకి రెండు బ్యాటరీ బగ్గీలు విరాళం
బెంగుళూరుకు చెందిన మరో భక్తుడు చంద్ర శేఖర్ మంగళవారం టీటీడీకి రూ.11 లక్షలు విలువైన రెండు బ్యాటరీ బగ్గీ వాహనాలను విరాళంగా అందించారు. ఈ మేరకు శ్రీవారి ఆలయం ముందు వాహనాలకు ప్రత్యేక పూజలు నిర్వహించి డిప్యూటీ ఈవో లోకనాథంకు వాహన తాళాలు అందజేశారు.