అమరావతి: అన్నమయ్య జిల్లా సంబేపల్లి మండలం యర్రగుంట్ల వద్ద రోడ్డుప్రమాదం (Road Accident) జరిగింది. సోమవారం ఉదయం ఎదురెదురుగా వస్తున్న రెండు కార్లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో హంద్రీనీవా కాలువ (HNS) పీలేరు యూనిట్-2 స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రమ (50) అక్కడికక్కడే మృతిచెందారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను రాయచోటి దవాఖానకు తరలించారు.
హాస్పిటల్లో చికిత్స పొందుతున్న బాధితులను జిల్లా కలెక్టర్ శ్రీధర్ పరామర్శించారు. మృతిచెందిన డిప్యూటీ కలెక్టర్ స్వస్థలం అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం. ఆమె అన్నమయ్య జిల్లా కలెక్టరేట్లో గ్రీవెన్స్‌కు కోఆర్డినేటర్‌గా పనిచేస్తున్నారు.