అమరావతి : ఏపీలోని పలు జిల్లాలను పొగమంచు ( Dense fog ) కమ్మేసింది. విజయవాడ (Vijayawada), విశాఖపట్నం (Visaka) , శ్రీకాకుళం తదితర ప్రాంతాలను శుక్రవారం దట్టమైన పొగమంచు చుట్టుముట్టేసింది. అంతర్జాతీయ విమానాశ్రయం విజయవాడ గన్నవరంలో (Gannavaram ) ముఖ్యంగా పొగమంచు కారణంగా ల్యాండ్ కావాలసిన విమానాలు గంటల పాటు ఆలస్యంగా నడుస్తున్నాయి.
హైదరాబాద్ నుంచి ఇండిగో (Indigo) విమానానికి రన్వే విజిబులిటీ లేక గాల్లో చక్కర్లు కొట్టింది. హైదరాబాద్ , చెన్నై , విజయవాడ నుంచి విశాఖకు రెండు నుంచి మూడు గంటల పాటు ఆలస్యంగా చేరుకున్నాయని, విశాఖ విమానాశ్రయం డైరెక్టర్ రాజారెడ్డి వివరించారు. శ్రీకాకుళం ( Srikakulam ) జిల్లాలో పొగమంచు వల్ల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.