తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో 10 కంపార్ట్మెంట్లు నిండిపోయాయి. టోకెన్లు లేని భక్తులకు 24 గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని టీటీడీ అధికారులు వెల్లడించారు. నిన్న స్వామివారిని 70,789 మంది భక్తులు దర్శించుకోగా 21,215 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 4,13 కోట్లు ఆదాయం వచ్చిందని తెలిపారు.
తిరుచ్చిపై సోమస్కందమూర్తి దర్శనం
తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం శ్రీ కామాక్షి సమేత శ్రీ సోమస్కంధమూర్తి తిరుచ్చిపై అనుగ్రహించారు. భజనమండళ్ల కోలాటాలు, భజనలు, మంగళవాయిద్యాల నడుమ పురవీధుల్లో వాహనసేవ కోలాహలంగా జరిగింది. అనంతరం అర్చకులు స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవె దేవేంద్ర బాబు, ఏఈవో పార్థసారధి, సూపరింటెండెంట్ భూపతి, భక్తులు పాల్గొన్నారు.