South Central Railway | బంగాళాఖాతంలో ఏర్పడిన మొంథా తుపాను ప్రభావంతో ఏపీతో పాటు పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మంగళవారం నాటికి తుపాను మచిలీపట్నం-కాకినాడ మధ్య తీరం దాటే అవకాశం ఉందని వాతావరణశాఖ అంచనా వేసింది. ఈ క్రమంలో భారీ ఈదురుగాలులతో పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ క్రమంలో దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికులకు కీలక సూచనలు చేసింది. ప్రయాణికులు తప్పనిసరి అయితేనే ప్రయాణం చేయాలని సూచించింది. విజయవాడలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి.. రైళ్ల రాకపోకలతో పాటు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నట్లు పేర్కొంది. తుపాను ప్రభావంతో పలు రైళ్లను రద్దు చేసే అవకాశం ఉందని.. ప్రయాణికులంతా స్టేషన్‌కు బయలుదేరే ముందు.. రైళ్ల స్టేటస్‌ను తెలుసుకొని ఇంటి నుంచి బయలుదేరాలని చెప్పింది.
భద్రత దృష్టిలో పెట్టుకొని చర్యలు తీసుకుంటున్నామని.. ఈ మేరకు ప్రయాణికులు సహకరించాలని దక్షిణ మధ్య రైల్వే విజ్ఞప్తి చేసింది. ఎన్టీఈఎస్ మొబైల్ యాప్ ద్వారా రైళ్లకు సంబంధించిన వివరాలను తెలుసుకోవచ్చని.. https://enquiry.indianrail.gov.in వెబ్సైట్లోనూ వివరాలు తెలుసుకోవచ్చని చెప్పింది. సౌత్ సెంట్రల్ రైల్వే, విజయవాడ డివిజన్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లోనూ సంప్రదించవచ్చని పేర్కొంది. తుపాను నేపథ్యంలో గూడూరు-08624-250795, నెల్లూరు (9063347961), ఒంగోలు (7815909489), బాపట్ల (7815909329), తెనాలి (7815909463), విజయవాడ (0866-2575167), ఏలూరు (7569305268), రాజమండ్రి (8331987657), సామర్లకోట (7382383188), తుని (7815909479), అనకాపల్లి (7569305669), భీమవరం (7815909402), గుడివాడ (7815909462) కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేసినట్లు వివరించింది. ఏవైనా రైళ్లకు సంబంధించిన ఎంక్వైరీ కోసం ప్రయాణీకులు సమీపంలోని రైల్వే స్టేషన్‌లోని అధికారులను సంప్రదించవచ్చని చెప్పింది.