విశాఖపట్నం: విశాఖపట్నం రైల్వే స్టేషన్లో (Railway Station) పెను ప్రమాదం తప్పింది. రైల్వే స్టేషన్లో విద్యుత్ తీగలు తెగిపడటంతో రైళ్ల రాకపోకలు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఆదివారం ఉదయం 5.20 గంటలకు తిరునల్వేలి-పురిలియా రైలు విశాఖ స్టేషన్కు వచ్చింది. ఈ క్రమంలో రైలు ఇంజిన్ ముందుకు వెళ్తుండగా విద్యుత్ తీగలు తెగిపడ్డాయి. అప్పటికీ ఆగని రైలు తీగలను అలానే కొంతదూరం ఈడ్చుకెళ్లింది.
అప్రమత్తమైన స్టేషన్ సిబ్బంది విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. దీంతో ప్రయాణికులకు పెను ప్రమాదం తప్పినట్లయింది. రంగంలోకి దిగిన సిబ్బంది విద్యుత్ తీగలను పునరుద్ధరిస్తున్నారు. పనులను డీఆర్ఎం పరిశీలిస్తున్నారు. ఈ నేపథ్యంలో పలు రైళ్లు నిలిచిపోయాయి.