తిరుమల : తిరుమల (Tirumala) లో భక్తుల రద్దీ పెరిగింది. కలియుగ ప్రత్యక్షదైవం వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో మొత్తం కంపార్టుమెంట్లు నిండిపోయాయి. వేలాది మంది భక్తులు శిలాతోరణం (Shilatoranam) వరకు క్యూలైన్లో దర్శనానికి నిలబడి ఉన్నారు.
నిన్న స్వామివారిని 61,499 మంది భక్తులు దర్శించుకోగా 33,384 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 3.04 వచ్చిందని టీటీడీ(TTD) అధికారులు తెలిపారు. టోకెన్లు లేని భక్తులకు 18 నుంచి 20 గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని వివరించారు.
జూన్ 17 నుంచి న అప్పలాయగుంటలో బ్రహ్మోత్సవాలు
తిరుపతి అప్పలాయగుంటలోని ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో జూన్ 17 నుంచి 25వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి.