తిరుమల : తిరుమలలో భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగింది. శ్రీవారి దర్శనం కోసం 31 కంపార్టుమెంట్లలో భక్తులు వేచియున్నారు. వీరికి సర్వదర్శనానికి 15 గంటల సమయం పడుతుందని టీటీడీ అధికారులు వెల్లడించారు. నిన్న స్వామివారిని 72,176 మంది భక్తులు దర్శించుకోగా 25,549 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 4.12 కోట్లు వచ్చిందని తెలిపారు.