అమరావతి : విశాఖపట్నం (Visaka) గాజువాక అక్కిరెడ్డిపాలెంలో ఓ ప్రేమ జంట ఆత్మహత్య (Couple Suicide) చేసుకుంది. వెంకటేశ్వరకాలనీలో నివాసముంటే పిల్లి దుర్గారావు, సాయి సుస్మిత మంగళవారం ఉదయం అపార్టుమెంట్ మూడో అంతస్తు నుంచి దూకి మృతి చెందారు. ఇద్దరూ అమలాపురానికి చెందినవారిగా పోలీసులు గుర్తించారు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. జంట మృతికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.