అమరావతి : ఏపీలోని అనంతపురం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. జిల్లాలోని బొమ్మనహాల్ మండలం నేమకల్లు గ్రామంలో దంపతులు ఆత్మహత్యకు (Couple suicide ) పాల్పడ్డారు. జరిగిన ప్రాథమిక సమాచార వివరాలు.. హోస్పేటకు చెందిన దంపతులు రెహమాన్ (25), హఫ్రీనా(20) నెల రోజుల క్రితం పెయింటింగ్ (Painting) పనుల కోసం నేమకల్లు వచ్చారు. అయితే సోమవారం ఇంటిలో ఇద్దరు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు.