అమరావతి : శ్రీకాకుళం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. అప్పుల బాధ, కుటుంబ కలహాల కారణంగా జిల్లాలోని పాలకొండ మండలం చినమంగళాపురం గ్రామానికి చెందిన దంపతులు రామారావు, తవిటమ్మ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. స్థానికులు గమనించి వీరిని ఆసుపత్రికి తరలిస్తుండగా భర్త రామారావు మార్గ మధ్యలోనే మృతి చెందాడు.
తవిటమ్మ పరిస్థితి విషమంగా ఉండగా..శ్రీకాకుళం రిమ్స్ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందజేస్తున్నారు.పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు .